
నాని – సాయి పల్లవి జంటగా ఏంసిఏ చిత్రంలో జోడి కట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వీరిద్దరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ జోడి కట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిదా ఫేమ్ ‘సాయి పల్లవి’ని తీసుకున్నారట. నానితో జత కట్టడానికి ఆమెతో ఇప్పటికే మేకర్స్ చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. నిజానికి సాయి పల్లవిని ఫిబ్రవరిలోనే మేకర్స్ సంప్రదించారట.. కానీ లాక్ డౌన్ కారణంగా ఆమె ఎంచెప్పలేకపోయిందట. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతి రావడం తో ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ వార్త ను అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించబోతున్నారట. ఈ చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది.









