
లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా మూతపడిన షూటింగ్ లు మళ్లీ జోరు అందుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీర్ ను కలిసిన సినీ పెద్దలు షూటింగ్ లకు పర్మిషన్ కోరగా..ఆయననుండి సానుకూల సమాధానం వచ్చింది.
దీంతో మళ్లీ షూటింగ్ లు సిద్ధం చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయికలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ కోసం వేసిన ప్రత్యేక సెట్ వర్షం కారణంగా ధ్వసం అయ్యింది. ఈ సినిమా కోసం సినిమా కోసం నగరంలోని అల్యూమినియం కర్మాగారంలో భారీ సెట్‌ను నిర్మించారు. సహజంగా సముద్రాన్ని తలపించేలా ఓ సెట్ తో పాటు ఓడ సెట్ కూడా వేశారట. ఎన్నో ప్రత్యేకలతో సెట్‌ని రూపొందించినట్టు తెలుస్తుండగా, రీసెంట్‌గా కురిసిన భారీ వర్షం వలన సెట్ పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. అసలే లక్డౌన్ కారణంగా షూటింగ్ కు ఆలస్యమైంది. ఇప్పుడేమో ఇలా సెట్ దెబ్బతినడంతో నిర్మాతలకు దాదాపు కోటి రూపాయిల వరకు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం .









