పేటీఎంను కూడా బ్యాన్ చేయాలంటున్న ఎంపీ..

భారత్ ఎలాగైనా చైనా ను దెబ్బ తీసేందుకు అడుగులు వేస్తుంది. ఇప్పటికే చైనా తో పలు వ్యాపారాలను తెగతెంపు చేసుకోగా ..తాజాగా చైనా కు సంబందించితిన్ 59 యాప్ లను భారత్ లో బ్యాన్ చేసింది. దీనిపై కాంగ్రెస్‌ నేత, తమిళనాడు ఎంపీ మనికం ఠాగూర్‌ స్పందించారు.

భారత్‌లో చైనాకు సంబంధించిన 59 యాప్‌ను నిషేదించిన కేంద్రం చర్యలను స్వాగతిస్తున్నామని అన్నారు. అలాగే ఈ కామర్స్‌ అప్లికేషన్‌ అయిన పేటీఎంను కూడా నిషేధించాలని ఆయన ప్రధాని మోడీని కోరారు. భారీ చైనా పెట్టుబడులు ఉన్న పేటీఎంను నిషేధించాలని కోరుతూ మణికం ఠాగూరు ట్వీట్‌ చేశారు.