పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి..

దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గడం లేదు. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత ఆయిల్ కంపెనీలు ప్రతీ రోజూ పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతున్నాయి. జూన్ 7 నుంచి వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా భారతదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.

గత 13 రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు..14 వ రోజు అదే స్థాయి లో పెరిగాయి. శనివారం పెట్రోల్‌పై లీటరుకు 0.51, డీజిల్‌పై 0.61 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.78.88 ఉండగా.. డీజిల్‌ ధర 77.67కి చేరింది. ముంబైలో ధర రూ.85.7 ఉండగా.. డీజిల్‌ ధర రూ.75.54 ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.81.88, డీజిల్ ధర డీజిల్‌ ధర రూ.75.91కి చేరింది. ఈనెల 9 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌, డీజిల్‌ పై సుమారు రూ.7 పెరిగింది.