‘రావణాసుర’ డిజిటల్ రైట్స్ వారికే


ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ భారీ విజయాలను అందుకున్న మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రావణాసుర. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై అభిషేక్‌ నామా నిర్మించిన ఈ సినిమాని యువ దర్శకుడు సుధీర్‌ వర్మ తెరకెక్కించారు. ఇక దక్ష నాగర్కర్‌, మేఘ ఆకాష్‌, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్‌ హీరోయిన్స్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ మూవీ పై అంచనాలు మరింతగా పెంచేసాయి.

Also Read :  Sigma: దళపతి విజయ్ కొడుకు డైరెక్షన్.. దుల్కర్ సల్మాన్ లాంచ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'సిగ్మా స్టైల్'!

ఇకపోతే ‘రావణాసుర’ ఓటిటి రైట్స్ ని ప్రముఖ సంస్థ అమేజాన్ ప్రైమ్ వీడియో వారు భారీ ధరకు సొంతం చేసుకున్నారు. ఇక బీమ్స్ సిసిలోరియో, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ మూవీ ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.