సాయి పల్లవి సీరియస్ వార్నింగ్..ఎందుకంటే

ఫిదా చిత్రం తో అందర్నీ ఫిదా చేసిన మలయాళ బ్యూటీ సాయి పల్లవి..మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కేవలం వెండితెరపై మాత్రమే కాదు యూట్యూబ్ లో కూడా అమ్మడు చాల ఫేమస్. అలాంటి ఈ భామ ప్రస్తుతం వేణు ఊడుగుల డైరెక్షన్లో ‘విరాట పర్వం’ చేస్తుంది.

తాజాగా ఈ భామ సీరియస్ అయ్యింది. ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవిని యాంకర్ మలయాళీ అని పిలవడంతో కోపం వచ్చిందట ‘అసలు నేను మలయాళీని కాను.. నేను తమిళమ్మాయిని.. కోయంబత్తూర్ లోనే పెరిగాను. నన్ను ఇంకెప్పుడు మలయాళీ అని మాత్రం పిలవకండి’ అంటూ కాస్త సీరియస్ అయ్యింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గానే రాణిస్తుంది.