
నాని – సాయి పల్లవి జంటగా ఏంసిఏ చిత్రంలో జోడి కట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వీరిద్దరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ జోడి కట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిదా ఫేమ్ ‘సాయి పల్లవి’ని ఎంపిక చేసారు. ఈ మూవీ లో సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందట. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుంది. రానాతో చేస్తున్న విరాటపర్వం మూవీలో కూడా సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయి పాత్ర చేస్తుంది.









