అక్కినేని కోడలు తగ్గించుకుందట..

లేడీ ఓరియంటెడ్ కథలతో వరుస సక్సెస్ లు అందుకుంటున్న సమంత..తాజాగా తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకుందట. ప్రస్తుతం సమంత.. నయనతార తో కలిసి ఓ తమిళ్ మూవీ చేయబోతుంది. విగ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా..త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రానుంది.

అయితే ఈ మూవీ కోసం సమంత తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారట. ఇది తక్కువ బడ్జెట్ మూవీ కావడంతో పాటు…కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతలకు భారం కాకోదని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈమె తీసుకున్న నిరణయానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఇక ఈ ఏడాది సమంత జాను చిత్రంలో నటించారు. ఈ మూవీ విడుదలైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లో ఆమె భవిష్యత్ ప్రాజెక్ట్స్ పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.