
ఇండియా – చైనా సరిహద్దు పోరాటంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. నిన్న అధికార లాంఛనాల నడుమ అంత్య క్రియలు జరిగాయి. కాగా ఈయన కు సంబందించిన పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన నిజాలు బయటపడ్డాయి.
ఆయన శరీరంపై గాయాలు లేనప్పటికీ తల భాగంలో మాత్రం కమిలిన గాయాలను గుర్తించారు. నీటి మునగడం వల్ల సంతోష్ బాబుతోపాటు మరో ఇద్దరు సైనికులు చనిపోయారని భావిస్తున్నారు. అమరులైన 20 మంది సైనికుల మృతదేహాలకు లేహ్‌లోని ఎస్ఎన్ఎం హాస్పిటల్లో అంత్యక్రియలు నిర్వహించారు. కొంత మంది సైనికుల శరీరం, ముఖంపై తీవ్ర గాయాలు ఉన్నాయని తేలింది. 17 మంది సైనికుల మృతదేహాలపై గాయాలను గుర్తించారు. మేకులతో కూడిన ఇనుప రాడ్లతో చైనా బలగాలు భారత సైనికులపై దాడి చేశారని పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలింది.









