‘సౌండ్ పార్టీ’ టీజర్‌కు దర్శకుడు సంపత్ నంది ప్రశంసలు


బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ విన్న‌ర్ వీజే స‌న్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, ప్రొడక్షన్ నెంబ‌ర్-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ. హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని సెప్టెంబ‌ర్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో డైర‌క్ట‌ర్ సంప‌త్ నంది చేతుల మీదుగా `సౌండ్ పార్టీ` టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా సంప‌త్ నంది మాట్లాడుతూ…“నేను కూడా గ‌తంలో కొన్ని చిత్రాల‌కు స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రించాను. అదే బాట‌లో జ‌య‌శంక‌ర్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హరిస్తున్నాడు. ఈ ట్రెడిష‌న్ ని ఇలాగే కొన‌సాగించాల‌ని కోరుకుంటున్నా. `సౌండ్ పార్టీ` టీజ‌ర్ బావుంది. అలాగే మోహిత్ చేసిన మ్యూజిక్ కూడా చాలా బావుంది. ఈ చిత్రం మ‌రో జాతిర‌త్నాలు సినిమాలా ఉండ‌బోతున్న‌ట్లు టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. వీజే స‌న్నికి ఇది మంచి సినిమా అవుతుంది. అంద‌రూ చేతిలో సెల్ ఫోన్, సిగ‌రెట్ ప‌ట్టుకుని తిరుగుతుంటారు జ‌య‌శంక‌ర్ మాత్ర పుస్త‌కం ప‌ట్టుకుని తిరుగుతుంటాడు. ఈ క్యాలిటీ న‌చ్చి `పేప‌ర్ బాయ్` సినిమా డైర‌క్ష‌న్ చేసే అవ‌కాశం ఇచ్చాను. ఈ సౌండ్ పార్టీ సినిమా అంద‌రికీ మంచి పేరు తేవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోర‌కుంటున్నా“ అన్నారు.

హీరో వీజే స‌న్ని మాట్లాడుతూ…“చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాము. జ‌య‌శంక‌ర్ స‌పోర్ట్ తో సంజ‌య్ సినిమా చాలా బాగా చేశాడు. శివ‌న్నారాయ‌ణ గారు నేను తండ్రికొడుకులుగా న‌టించాం. సినిమా అంతా ఇద్ద‌రం ఫుల్ గా నవ్విస్తాం. మోహిత్ అద్భ‌తుమైన మ్యూజిక్ ఇచ్చాడు. అంద‌రూ ఫ్యామిలీతో వెళ్లి మా సినిమా చూసి పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో – రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న‌ ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. టి ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. ఓ. : జీ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : జ‌య‌శంక‌ర్‌ ; రచన – ద‌ర్శ‌కత్వం : సంజ‌య్ శేరి