
విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే డైరెక్టర్ బాల..ప్రస్తుతం సూర్య తో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఈరోజు కన్య కుమారి వద్ద మొదలైంది. ఈ మూవీ లో సూర్య కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. కృతి శెట్టి నటించిన చిత్రాలు చూసి ఆమె నటనకు ఫిదా అయినా బాల ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
అలాగే టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో మెయిన్ హీరోయిన్ పాత్రలు రాకపోయినా తమిళ మేకర్స్ మాత్రం ఆమెకు మంచి పాత్రలు ఇస్తున్నారు. ఇక ఈ మూవీ సూర్య కు 41 వ చిత్రం కావడం విశేషం.









