సుశాంత్ ఫైనల్ పోస్ట్‌మార్టం రిపోర్ట్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ గత వారం తన గదిలో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు పోస్ట్ మార్టం చేసి ఆ వివరాలు మీడియా కు తెలుపగా..తాజాగా ఫైనల్ రిపోర్ట్ ను తెలిపారు.

అందులో కూడా ఆయనది ఆత్మహత్యే అని స్పష్టం చేసింది ఈ నివేదిక. ఈయన మరణం అనుమానాస్పద రీతిలో ఏం జరగలేదని.. పైగా చనిపోయినపుడు అతడి శరీరంపై ఎలాంటి గాయాలు కూడా లేవని తుది నివేదికలో వెల్లడైంది. కేవలం ఉరి వేసుకోవడం వల్లే ఊపిరాడక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించాడని.. సుశాంత్ మరణానికి ఊపిరాడకపోవడమే కారణమని పోస్ట్‌మార్టం తుది నివేదికలో తేలింది.