
లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ , సినీ షూటింగ్స్ , సీరియల్స్ బంద్ కావడం తో వెండితెర ప్రేక్షకులు, బుల్లితెర ప్రేక్షకులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. అయితే ఇక ఆ నిరాశ నుండి ప్రేక్షకులు బయటపడబోతున్నారు. ఎందుకంటే సోమవారం నుండి బుల్లితెర సీరియల్స్ ప్రసారం కాబోతున్నాయి.
ప్రస్తుతం లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో సీరియల్ షూటింగ్ లు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ దర్శకులు చిత్రీకరణను ప్రారంభించారు. అయితే ఇన్ని రోజులు పాత ఎపిసోడ్లు, సెలబ్రెటీలు ఇంట్లో ఉండి చేసిన కొన్ని వినోద కార్యక్రమాలను ప్రచారం చేసారు. ఇక షూటింగ్ లు ప్రారంభించటంతో రేపటి నుండి కొత్త ఎపిసోడ్లు, రియాలిటీ షోలు ప్రసారం కానున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని ప్రముఖ ఛానళ్లు రేపటి నుండి కొత్త ఎపిసోడ్లను, రియాలిటీ షో లను ప్రసారం చేస్తునట్టు వెల్లడించాయి.









