అల్లరి నరేష్ ఉగ్ర రూపం


హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన ‘నాంది’ చిత్రం కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ముఖ్యంగా అల్లరి నరేష్ ఈ చిత్రాన్ని తన సరికొత్త ఇన్నింగ్స్ నాందిగా భావించారు. వీరిద్దరూ కలిసి తమ రెండో సినిమా కోసం చేతులు కలిపారు. ఇటివలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

ముహూర్తం షాట్‌కు నిర్మాత దిల్ రాజు క్లాప్‌బోర్డ్‌ ఇవ్వగా, నిర్మాత దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మొదటి షాట్‌కి దర్శకత్వం వహించగా, దర్శకుడి తల్లిదండ్రులు రామకోటేశ్వరరావు కనకమేడల, లోకేశ్వరి కనకమేడల స్క్రిప్ట్‌ను అందజేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండే ఈ చిత్రానికి ‘ఉగ్రం’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లరి నరేష్ ఆవేశంతో అరుస్తుండగా, అతని వెనుక భాగంలో కత్తిపోటు, శరీరమంతా గాయాలు ఉన్నాయి.