
Kalvakuntla Kavitha కొత్త పార్టీ స్థాపనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోందని, మంచి ముహూర్తం చూసుకుని త్వరలోనే పార్టీని ప్రకటిస్తానని తెలిపారు. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నానని, అదే దిశగా పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. శ్రీరామనవమి తర్వాత పార్టీ ప్రకటన ఉండొచ్చని, అంతకుముందే జాతీయ స్థాయి నేతలను కలుస్తానని వెల్లడించారు. కొత్త పార్టీ కార్యాలయం కోసం స్థలం పరిశీలిస్తున్నామని, చాలా మంది జాతీయ నాయకులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తన రాజకీయాల్లో ఎవరితోనూ రాజీ లేదని స్పష్టం చేసిన కవిత, “డాడీ, మోడీ, చిన్న మోడీ”పై తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. బీఆర్ఎస్‌తో ఉన్న తన ఇష్యూను కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని ఆరోపించారు. కొత్త పార్టీ ద్వారా ఉద్యమంలో పనిచేసిన యువతకు అవకాశాలు కల్పిస్తామని, అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో తమ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వనపర్తి సహా పలు ప్రాంతాల నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని వెల్లడించారు.











