
Konda Surekha : తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల అక్కినేని నాగార్జున మరియు ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో పెద్ద వివాదం రేగింది. కేటీఆర్ వల్లే నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్నారని గతంలో కొండా సురేఖ ఆరోపించారు. ఈ కామెంట్స్ రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలతో తమ కుటుంబ ప్రతిష్ట దెబ్బతిన్నదని భావించిన నాగార్జున, కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేయగా.. ప్రస్తుతం అది కోర్టులో నడుస్తుంది.
ఈ నేపథ్యంలో కొండా సురేఖ, నాగార్జునకు క్షమాపణలు చెబుతూ అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. నాగార్జున గారు లేదా ఆయన కుటుంబాన్ని బాధించాలనే ఉద్దేశ్యం తనకు లేదని గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. వారు బాధపడి ఉంటే తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నానని సురేఖ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, నాగార్జున ఇప్పటికే పరువు నష్టం దావా వేసి ఉండగా, ఈ కేసుకు సంబంధించిన విచారణ నాంపల్లి ప్రత్యేక కోర్టులో రేపు జరగనుంది. విచారణకు ఒక రోజు ముందు సురేఖ క్షమాపణ చెప్పడం ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరి ఈ క్షమాపణను నాగార్జున కుటుంబం ఎలా స్వీకరిస్తుంది, పరువు నష్టం దావాపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.
I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members.
I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members.
I regret any unintended impression…
— Konda Surekha (@iamkondasurekha) November 11, 2025












