ప్రముఖ నటుడు కన్నుమూత..

బ్లాక్ పాంథర్ నటుడు చాడ్విక్ బోస్మాన్ కన్నుమూశారు. 43 ఏళ్ల వ‌య‌స్సులో పెద్ద ప్రేగు క్యాన్స‌ర్‌తో క‌న్నుమూసారు. ఈ విష‌యాన్ని ఆయ‌న కుటుంబం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 2016 నుండి స్టేజ్ త్రీ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న చాడ్విక్ అతను తన ఇంట్లోనే, అతని భార్య మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఉండగా మరణించాడు. అత‌ని మృతికి హాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌క ఘ‌న నివాళులు అర్పిస్తుంది.

ఇక కుటుంబం విడుదల చేసిన ఆ ప్రకటనలో అతను తన ఇంటిలో, అతని భార్య మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఉండగా మరణించాడని పేర్కొన్నారు. 2016లో రిలీజ్ అయిన కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ లో మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్ గా కనిపించిన తరువాత బోస్మాన్ పేరు వెలుగులోకి వచ్చింది. అంతకు ముందే కొన్ని సినిమాలు చేసినా ఈ కెప్టెన్ అమెరికా తరువాత ఫేమస్ అయ్యాడు. ఇక ఆ సినిమాలో పాత్రనే అతను అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ మరియు ఎవెంజర్స్: ఎండ్‌గేమ్‌ లో కూడా పోషించాడు. ఈ ఏడాది ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన దర్శకుడు స్పైక్ లీ డా 5 బ్లడ్స్‌లో అతని చివరి సినిమా.

pic.twitter.com/aZ2JzDf5ai— Chadwick Boseman (@chadwickboseman) August 29, 2020