‌ ‘డియర్ కామ్రేడ్’ కు అక్కడ భారీ రెస్పాన్స్..

విజయ్ దేవరకొండ – భరత్ కమ్మ కలయిక లో తెలుగు, తమిళ్ , మలయాళం , కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డియర్ కామ్రేడ్. మొదటి రోజు మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఈ మూవీ తాజాగా హిందీలోయూట్యూబ్ లో అనువాదం అయ్యి భారీ వ్యూస్ సొంతం చేసుకుంది.

ఇటివ‌లి కాలంలో తెలుగు చిత్రాల‌ని అనువాదం చేసి హిందీలో రిలీజ్ చేస్తున్నారు. వీటికి యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్ వ‌స్తుంది. డియర్ కామ్రేడ్ సైతం హిందీలో అనువాదం అయ్యింది. ఈ చిత్రానికి 160 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ రాగా, 2 మిలియ‌న్స్ లైక్స్ వచ్చాయి. ఇప్ప‌టి వర‌కు ఏ భారతీయ చిత్రానికి ఈ స్థాయిలో లైక్స్ రాలేదని అంటున్నారు. గోల్డ్ మైన్స్ టెలిఫిలింస్ సంస్థ హిందీ అనువాద హ‌క్కుల‌ని కొనుగోలు చేసి ఈ ఏడాది జ‌న‌వ‌రి 19న యూ ట్యూబ్ ఛానెల్‌లో విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు 2 మిలియ‌న్ లైక్స్ రావ‌డంతో మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

Lilly & Bobby ❤️#DearComrade https://t.co/leRMFBwxeg pic.twitter.com/jXRGWtNwDl— Mythri Movie Makers (@MythriOfficial) August 28, 2020