ఎఫ్ 2 ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ కలెక్షన్స్…

వెంకటేష్, వరుణ్ సందేశ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎఫ్ 2. సంక్రాంతి బరిలో చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చిత్రాన్ని చూసేందుకు పరుగులు తీస్తున్నారు.. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుంది.

ఇక కలక్షన్ల విషయానికి వస్తే ఫస్ట్ వీక్ లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.43 కోట్లషేర్ ను రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విషయానికి వస్తే రూ. 35.05 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా ఫస్ట్ వీక్ కలెక్షన్లు చూస్తే..

ఏరియా కలక్షన్స్
నైజాం 11.80 కోట్లు
సీడెడ్ 4.57 కోట్లు
ఉత్తరాంధ్ర 4.71 కోట్లు
తూర్పు గోదావరి 4.24 కోట్లు
పశ్చిమ గోదావరి 2.36 కోట్లు
కృష్ణ 3.12కోట్లు
గుంటూరు 3.14 కోట్లు
నెల్లూరు 1.11 కోట్లు
టోటల్(ఏపీ + తెలంగాణా) 35.05 కోట్లు