కింగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

కింగ్ నాగార్జున పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 1959 ఆగస్టు 29న ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు- అన్నపూర్ణ దంపతులకు రెండో కుమారుడిగా నాగార్జున జన్మించారు. చెన్నై జన్మించిన నాగార్జున.. ఆ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తర్వాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు.

ఇక, తన తండ్రి నాగేశ్వరరావు వారసత్వాన్ని పునికిపుచ్చుని 1986లో ‘విక్రమ్’ సినిమాతో అరంగ్రేటం చేసిన నాగ్.. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. అలాగని ఆయన సినీ కెరీర్ మొత్తం సాఫీగా సాగిపోలేదు.. ఆయన కెరీర్‌లో ఫ్లాప్‌లు కూడా పలకరించాయి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడి.. టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వెండితెర ఫైనే కాకుండా బుల్లితెర ఫై సైతం సందడి చేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా చేసిన నాగ్..ఇప్పుడు సీజన్ 4 కు సైతం హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అలాంటి మన్మధుడికి తెలుగుమిర్చి తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నాం.