రేప్ ఫై ఆరోపణలపై నటుడు కృష్ణుడు క్లారిటీ..

తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఓ యువతీ తనను 139 రేప్ చేసారని పిర్యాదు చేయడం అందులో సినీ , రాజకీయ ప్ర్మముఖుల పేర్లు ఉండడం తో హాట్ టాపిక్ అయ్యింది . ఇప్పటికే యాంకర్ ప్రదీప్ ఈ అత్యాచారం ఫై క్లారిటీ ఇవ్వగా..తాజాగా కమెడియన్ కృష్ణుడు క్లారిటీ ఇచ్చాడు.

ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ కేసు తప్పుడు కేసుగానే తాను భావిస్తున్నట్టు తెలిపాడు. చదువుకున్న యువతికి అన్యాయం జరుగుతుంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని..11 ఏళ్లుగా ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించాడు.

సెలెబ్రెటీలను కేసులో ఇరికిస్తే కేసు తీవ్రత పెరుగుతుందనుకుంటే తప్పు అని.. ఈ కేసులో నిజనిజాలను వెలికి తీయాలని కృష్ణుడు పోలీసులను కోరాడు. ఈ ఆరోపణలు మాకు మా కుటుంబ సభ్యులను మానసికంగా ఇబ్బందులు పెడుతాయని స్పష్టం చేశారు.