చరణ్ కోసం ఆ ఇద్దరు డైరెక్టర్లు..?

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. దీంతో పాటు చిరంజీవి తో కొరటాల శివ చేస్తున్న ఆచార్య మూవీ ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. వీటి తర్వాత ఏంటి అనేది జవాబు లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న అగ్ర హీరోలంతా ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో చిత్రాన్ని లైన్లో పెడుతున్నారు. అయితే చరణ్ మాత్రం తన నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరు అనేది తేల్చుకోలేకపోతున్నాడు.

కానీ చరణ్ తో సినిమా చేయాలనీ సందీప్ వంగ, మరొకరు బాలీవుడ్ లో వెళ్లేందుకు రెడీగా ఉన్న డీసెంట్ ఫిల్మ్ మేకర్ గౌతమ్ తిన్ననూరి సిద్ధంగా ఉన్నారు.ఈ ఇద్దరి దర్శకులు ఒక్కొక్కరు ఒక్కో తరహా సినిమా స్పెషలిస్టులు వీరిద్దరి పేర్లే ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి చరణ్ ఎవరికీ ఓకే చెపుతున్నాడో చూడాలి.