రెండవ బిడ్డను చూపించిన స్నేహ..

తొలి వలపు చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన స్నేహ..మొదటి చిత్రంతోనే ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస ఫ్యామిలీ చిత్రాలలో నటిస్తూ..అతి తక్కువ టైం లోనే ఫ్యామిలీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2012 లో త‌మిళ న‌టుడు ప్ర‌స‌న్న ను పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది. పెళ్లి చేసుకున్నాక కూడా పలు సినిమాల్లో , బుల్లితెర షోస్ కు హోస్ట్ గా వ్యవహరించి ఆకట్టుకుంది.

రీసెంట్ గా రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. ఇన్ని రోజుల తర్వాత స్నేహా దంపతులు తమ రెండవ సంతానం అయిన పాపను పరిచయం చేశారు. నేడు ప్రసన్న 38వ పుట్టిన రోజు సందర్బంగా పాప ఆధ్యంతా ఫొటోలను రివీల్ చేశారు. ఆధ్యంతా ఈ ఏడాది జనవరి 24వ తారీకున జన్మించింది. పాప ఫొటోలను విడుదల చేసేందుకు సరైన సమయం ఇదే అని ప్రసన్న పుట్టిన రోజుకు ప్రపంచానికి చూపించారు.