వివాదాల్లో చిక్కుకున్న బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడు

బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడు వివాదాల్లో చిక్కుకున్నాడు. శ్రీకాంత్ అనే యువకుడు తనకు నూతన నాయుడు శిరోముండనం(గుండు గీయించడం) చేసాడని పోలీసులకు పిర్యాదు చేయడం సంచలనం గా మారింది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాతనగర్ లో నివాసముంటున్న నూతన నాయుడు ఇంట్లో గత నాలుగు నెలలగా దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పని చేస్తున్నారు.

ఆగ‌స్ట్ 1వ తేదీ నుండి ఆయ‌న చెప్పకుండా పనిమానేయడంతో శ్రీకాంత్ పై కోపంతో సెల్ ఫోన్ పోయింది, దానికోసం మాట్లాడదాం ఇంటికి రమ్మని చెప్పాడ‌ట‌ నూతన్ నాయుడు. ఇంటికి వ‌చ్చిన శ్రీకాంత్‌కి నూత‌న్ నాయుడు గుండు కొట్టించిన‌ట్టుగా శ్రీకాంత్ పోలీసులకు పిర్యాదు చేసాడు. ప్రస్తుతం దళిత సంఘాలు నూతన్ ఫై మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.