నాగ్ బర్త్ డే స్పెషల్ : వైల్డ్ డాగ్ న్యూ పోస్టర్

కింగ్ నాగార్జున పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా నాగ్ నటిస్తున్న తాజా చిత్రం వైల్డ్ డాగ్ కు సంబందించిన సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో ‘వైల్డ్ డాగ్‌’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుద‌లైన పోస్ట‌ర్‌తో నాగ్ టీంని ప‌రిచ‌యం చేసింది చిత్ర బృందం.

ఈ సినిమాలో నాగార్జున ఎన్‌.ఐ.ఎ ఆఫీస‌ర్‌గా కనిపించనున్నారు. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. కిర‌ణ్ కుమార్ డైలాగ్స్ రాశారు. షానియ‌ల్ డియో సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.