ఏపీ అధికారులకు ఇసుక కష్టాలు..

భవన కార్మికులకు కదా ఇసుక కష్టాలు..అధికారులకు కష్టాలు ఏంటి అనుకుంటున్నారా..గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. వరదల వల్ల ఇసుక ఇబ్బంది గా మారిందని ప్రభుత్వం చెపుతున్న విపక్షాలు మాత్రం జగన్ సర్కార్ తీరు వల్లే ఇసుక కష్టాలు అని ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రాష్ట్రంలో ఇసుక కొరత తీరే వరకూ అధికారులెవరూ సెలువులు తీసుకోవద్దన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే ఎక్కువ ధరకు ఇసుకను విక్రయించే వారికి రెండేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఇసుక డిమాండ్‌ సగటున 80 వేల టన్నులు ఉండేదన్న సీఎం.. ప్రస్తుతం రీచ్‌ల సంఖ్య 60 నుంచి 90కి పెరిగిందన్నారు. వారం రోజుల్లో పరిస్థితి మెరుగుపడిందని.. ఇసుక లభ్యత పెరిగిందన్నారు. నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు.