కోవిద్ పరీక్షల్లో ఏపీ మరో మైలురాయి

కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకూ 6.12 లక్షల మందికి పైగా పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు వారంలోనే లక్ష టెస్ట్ లను చేసే స్థాయికి చేరింది. జనాభాలో ప్రతి పది లక్షల మందికీ సగటున 11,468 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి పరీక్షలు చేసేందుకు కట్టుబడివున్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

రాష్ట్రంలో తొలి లక్ష పరీక్షలకు 58 రోజులు పట్టగా, ఆపై 2 లక్షల పరీక్షలకు 12 రోజులు, 3 లక్షలకు 11 రోజులు, 4 లక్షలకు 10 రోజులు, 5 లక్షలకు 8 రోజులు, 6 లక్షలకు 7 రోజుల సమయం మాత్రమే పట్టింది.