Srinidhi Shetty: ఆ హీరోయిన్ రెమ్యునరేషన్ విని షాకైన రామ్ పోతినేని.. అందుకే కన్నడ బ్యూటీని పక్కన పెట్టారా?

Srinidhi Shetty

Srinidhi Shetty: హీరో రామ్ పోతినేని ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఫిలిం నగర్ వర్గాల్లో తాజాగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, హీరో సరసన నటించే హీరోయిన్ కోసం మేకర్స్ గట్టి వేటలోనే ఉన్నారు.

మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టిని నటింపజేయాలని రామ్ అండ్ టీమ్ భావించినట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె ఏకంగా రూ. కోటిన్నర (1.5 Crore) పారితోషికం డిమాండ్ చేసిందని టాక్. రెమ్యునరేషన్ భారీగా ఉండటంతో మేకర్స్ ఇప్పుడు ఇతర ఆప్షన్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Also Read :  Lenin: అయ్యగారు వచ్చేది అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. ఎప్పుడో తెలుసా?

శ్రీనిధి శెట్టి తర్వాత ఇప్పుడు మరో కన్నడ కస్తూరి కయాడు లోహార్ (Kayadu Lohar) పేరు ఈ సినిమా కోసం ప్రముఖంగా పరిశీలనలోకి వచ్చిందట. రామ్ పక్కన ఈ హీరోయిన్ అయితే బాగుంటుందని భావిస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఆమె డేట్ల సర్దుబాటు (Dates Adjustment) ఒక సమస్యగా మారినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. డేట్స్ కుదిరితే రామ్ సరసన ఈమె ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

Also Read :  Kiran Abbavaram: రైటర్‌గా హిట్టు కొట్టాడు.. ఇప్పుడు డైరెక్టర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కిరణ్ అబ్బవరం! రేపే ముహూర్తం..

వీరిద్దరితో పాటు సంయుక్త మీనన్ పేరును కూడా చిత్ర యూనిట్ ఒక ఆప్షన్‌గా పెట్టుకుందని సమాచారం. రామ్ ప్రాజెక్ట్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఒక స్టార్ హీరోయిన్ ఉంటే సినిమాకు మరింత ప్లస్ అవుతుందని కూడా భావిస్తున్నారట. చూడాలి మరి మొత్తానికి ఈ ముగ్గురు భామలలో రామ్ సరసన లక్కీ ఛాన్స్ ఎవరు కొట్టేస్తారనే దానిపై ఈ నెలాఖరులోగా ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.