
NBK 112: నటసింహం నందమూరి బాలకృష్ణ – సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ (NBK 112) ముహూర్తానికి సమయం ఆసన్నమైంది. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ గ్రాండ్ లాంచ్ డేట్‌ను మేకర్స్ జూన్ 25న అత్యంత ఘనంగా ప్రారంభించబోతున్నారని సమాచారం. అమరావతి పరిధిలోని వెంకటాయపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేసి సినిమాను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 25న లాంచ్ పూర్తి చేసి, జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ (ఫస్ట్ షెడ్యూల్) స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు ‘కార్పెంటర్’ (Carpenter) అనే ఆసక్తికరమైన తాత్కాలిక టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇందులో బాలయ్యను మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నారట. కథ ప్రకారం.. హీరో పైకి సాధారణ కార్పెంటర్ (వడ్రంగి) లా కనిపిస్తాడు కానీ, అతని వెనుక ఒక భయంకరమైన గ్యాంగ్‌స్టర్ గతం దాగి ఉంటుందట. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్, పవర్‌ఫుల్ ఎమోషన్స్, హై-వోల్టేజ్ యాక్షన్‌తో ఈ మాస్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ రెడీ అయ్యిందని టాక్. ఈ సినిమాలో యాంగ్రీ ఎంగ్ మ్యాన్ రాజశేఖర్ కీ రోల్‌లో కనిపించబోతున్నరని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనను మేకర్స్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అతి త్వరలో వచ్చే అవకాశం ఉందని సమాచారం.













