
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 రోగుల సంఖ్య భారీగా పెరిగింది. రోగులు, డాక్టర్లు ఈ మహమ్మారినుంచి బయట పడేందుకు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్లెన్ మార్క్ సంస్థ శుభవార్త వినిపించింది. కోవిడ్-19 వ్యాధిని నయం చేసే మందును కనిపెట్టామని భారత్‌లోని గ్లెన్‌మార్క్ ఫార్మా సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వల్ప స్థాయి నుంచి ఒక మోస్తరు తీవ్రతతో కోవిడ్-19తో బాధపడుతున్న వారి మీద ఈ మందు ప్రభావం చూపనుందని తెలిపింది.
తమ సంస్థ అభివృద్ధి చేసిన ఈ మందు, ఫావిపిరవిర్ కోవిడ్ 19 రోగులపై మెరుగ్గా పని చేసిందని, రోగుల్లో 88 శాతం మెరుగుదల కనిపించిందని గ్లెన్‌మార్క్ తెలిపింది. ఈమేరకు సంస్థ ఒక ప్రకటన విడుదలచేసింది. ఈ ఔషధంతో చేసిన పరిశోధనలలో గర్భిణులను, పాలిచ్చే తల్లులను చేర్చలేదని ఆ సంస్థ వివరించింది. ఈ ఫావిపిరవిర్ మందును గ్లెన్‌మార్క్ ‘ఫ్యాబిఫ్లూ’ అనే పేరుతో రూపొందిన ఈ డ్రగ్ మంచి ఫలితాల్ని ఇస్తుందని ఇప్పటికి పలు కేసుల్లో రుజువైయిందని చెబుతున్నారు. తర్వలోనే పూర్తి స్థాయిలో ఈ మందుని మార్కెట్ తీసుకురావడానికి సంస్థ సన్నాహాలు చేస్తుంది.









