2021 మార్చి నాటికి 25కోట్ల మంది వైర‌స్ !

ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం సృష్టిస్తోన్న క‌రోనా వైర‌స్ మహ‌మ్మారి ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోటి ప‌దిల‌క్ష‌ల మందికి సోకి, దాదాపు ఐదున్న‌ర ల‌క్ష‌ల మందిని పొట్ట‌న‌పెట్టుకుంది. అయితే, ఈ పాజిటివ్ కేసుల‌ సంఖ్య ప్ర‌స్తుతం న‌మోదైన దానికంటే దాదాపు 12రెట్లు ఎక్కువ‌గానే ఉండ‌వ‌చ్చ‌ని మ‌సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఎంఐటీ) శాస్త్రవేత్త‌లు విశ్లేషిస్తున్నారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

ఈ మ‌హ‌మ్మారిని స‌మ‌ర్థంగా క‌ట్ట‌డిచేయ‌కుంటే 2021 మార్చి నాటికి 25కోట్ల మంది ఈ వైర‌స్ బారిన‌ప‌డ‌డంతోపాటు 18ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్న‌ట్లు ఎంఐటీ శాస్త్రవేత్త‌లు అంచ‌నా వేశారు.