
వన్‌ప్లస్ నుంచి త్వరలో కొత్త ఫోన్ రాబోతోంది. నిస్తేజంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ ని పూర్వస్థితిని తెచ్చేలా.. భారత్, యూరప్ మార్కెట్‌లో తమ బ్రాండ్ ఉనికి పెంచుకునేలా వన్‌ప్లస్ సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ తేనుంది. ఐదేళ్ల కిందట మొదటిసారిగా వన్‌ప్లస్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ ప్రధాన కార్యాలయం వెలుపల ప్రాంతంలో విడుదల చేసింది.
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వినియోగదారులకు ఇప్పుడు విడుదల చేయబోయే వన్‌ప్లస్ నార్డ్ మంచి ఎంపికగా ఉండబోతోందని సంస్థ భావిస్తోంది. ఈ వన్‌ప్లస్ నార్డ్ శ్రేణి తమ సంస్థ కొత్త గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీని అనుసరిస్తుందని తెలిపింది కంపెనీ తెలిపింది.









