Basil Joseph: బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘మల్లు అర్జున్’ కోసం మాలీవుడ్ సెన్సేషన్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

Basil Joseph

Basil Joseph: మలయాళ చిత్ర పరిశ్రమలో ‘మిన్నల్ మురళి’ వంటి అద్భుతమైన విజువల్ వండర్‌తో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్. ఇప్పుడు ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించిన సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది.

సాధారణంగా బాసిల్ జోసెఫ్ సినిమాల్లో హృదయానికి హత్తుకునే హాస్యం, చక్కటి ఎమోషన్స్ ఉంటాయని అందరికి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కోసం ఆయన ఒక రెగ్యులర్ రొమాంటిక్ కామెడీ కథను కాకుండా, సిల్వర్ స్క్రీన్‌పై ఇంతవరకు ఎవరూ ప్రయత్నించని సరికొత్త, వినూత్నమైన కాన్సెప్ట్‌ను రెడీ చేస్తున్నట్లు సమాచారం. గ్లోబల్ ఆడియన్స్‌ను సైతం మెప్పించేలా సరిహద్దులు దాటిన ఒక యూనిక్ పాయింట్‌తో ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోందని సమాచారం.

Also Read :  Geethu Mohandas: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ బర్త్‌డే గిఫ్ట్ అదిరింది.. వైరల్ అవుతున్న ‘టాక్సిక్’ వీడియో!

పుష్ప సిరీస్‌తో గ్లోబల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇమేజ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యేలా, అదే సమయంలో బాసిల్ జోసెఫ్ మార్క్ లార్జర్ ద్యాన్ లైఫ్ ఎలిమెంట్స్ ఉండేలా ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వినూత్నమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీని టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుందని టాక్. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ లైనప్‌లో అట్లీ, లోకేష్ కనకరాజ్ వంటి అగ్ర దర్శకుల సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు బాసిల్ జోసెఫ్ సినిమా నుంచి ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకముందే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.