బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తుల విక్రయం స్టార్ట్

కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ , మహానగర్‌ టెలిఫోన్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌)కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొంది. దీనికోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ) ఇప్పటికే ఒక కన్సల్టెంట్లను నియమించింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

సీబీఆర్‌ఈ, జేఎల్‌ఎల్‌, నైట్‌ఫ్రాంక్‌ సంస్థలు ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ఆస్తుల విక్రయాలకు కన్సల్టెంట్లుగా వ్యవహరించనున్నాయి. కరోనా మహమ్మారి వ్యాపించిన సమయంలో ఆస్తుల విక్రయం లాభదాయకమా? కాదా? అనే అంశాన్ని పరిశీలించనున్నాయి.