
అల వైకుంఠపురం లో చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రష్మిక హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు ఇద్దరు సోదరులుంటారని, అందులో ఒకరు సర్పంచ్ గా కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సర్పంచ్ పాత్రలో కోలీవుడ్ నటుడు ఆదిపినిశెట్టి నటిస్తాడని వార్తలు సోషల్ మీడియా లో వైరల్ కావడం తో ఆది ఈ వార్తల ఫై క్లారిటీ ఇచ్చారు. తాను ఈ చిత్రంలో నటించడం లేదని, తనపై వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లేనని తేల్చి చెప్పాడు. పుష్ప సినిమాకు సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని ఆది చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్.









