కొవిడ్‌ రోగులకు ఇన్‌హీలర్‌


కరోనావైరస్‌ రోగులకు అత్యవసర చికిత్సలో వినియోగించే రెమిడెసివిర్‌ను సరికొత్త రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు గిలిద్‌ సైన్సెస్‌ ప్రయత్నాలను ప్రారంభించింది. ఇప్పటి వరకు రెమిడెసివిర్‌ను ఇంజెక్షన్‌ రూపంలో రోగుల ఇస్తున్నారు.

తాజాగా ఈ యాంటీ వైరల్‌ ఔషధాన్ని ఇన్‌హీలర్‌ రూపంలో వినియోగించే అంశంపై సదరు సంస్థ పరీక్షలను మొదలుపెట్టింది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా వెల్లడించింది. దీనికోసం 18-45ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 60 మందిని ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతమై ఇన్‌హీలర్‌ అందుబాటులోకి వస్తే రోగులు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.