
లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. సినీ స్టార్స్ సైతం షూటింగ్ లు బంద్ కావడం తో వారికీ ఫుల్ రెస్ట్ దొరికినట్లు అయ్యింది. ఎప్పుడు షూటింగ్ లతో బిజీ గా గడిపే వీరు..ఇప్పుడు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. మరికొంతమంది వంటిట్లో తమకు ఇష్టమైన వంటకాలు చేస్తూ బిజీ అవుతున్నారు.
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మాత్రం సోషల్ మీడియా లో అందాల ప్రదర్శన చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఫ్యాషన్ డ్రెస్సింగ్ స్టైల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈ భామ..తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ కి , తెలుగు ఇండస్ట్రీ కి మధ్య తేడాలు చెప్పుకొచ్చింది. ‘‘బాలీవుడ్‌కు, టాలీవుడ్‌కు ఉన్న తేడా ఏమిటంటే.. బాలీవుడ్ సెట్స్‌లో పోహా టిఫిన్‌గా పెడితే.. టాలీవుడ్ సెట్స్‌లో ఇడ్లీ, దోశ పెడతారు. అంతే.. అంతకు మించి ఎటువంటి తేడా లేదు..’’ అని తెలిపింది. ఇంకా టాలీవుడ్లో తనకు పవన్ కల్యాణ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన నిధి.. హీరోయిన్లలో కాజల్, సమంత, నయనతారలంటే ఇష్టమని తెలిపింది. తన దృష్టిలో ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ హృతిక్ రోషన్ మాత్రమేనని కూడా నిధి తెలిపింది.









