
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరికొంతమందికి విసురుతున్నారు.
ఇందులో భాగంగా జబర్దస్త్ రాకేష్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు నానక్ రామ్ గూడలో మొక్కలు నాటారు జబర్దస్త్ కమెడియన్స్ ముక్కు అవినాష్, నేహంత్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. మొక్కలు నాటడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు హైదరాబాదులో ఎక్కడ చెట్టు కనిపించేది కాదని.. కానీ ఈ రోజు ఎక్కడ చూసినా కూడా పచ్చని చెట్ల తోనే కనిపిస్తుందని తెలిపారు. ఈ సందర్భాంగా యాంకర్ రాధ V6 ,ఆదిరే అభి ,కెవ్వు కార్తిక్ లను మొక్కలు నాటాలని సవాల్ విసిరాడు అవినాష్.









