
విరసం నేత వరవరరావు కరోనా బారిన పడ్డారు. భీమా కోరేగావ్ కేసులో కొన్ని నెలల నుంచి ముంబైలోని జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం నేవీ ముంబైలోని జేజే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజుల నుంచి ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు కోరగా… ఇటీవల ఆయనను జేజే ఆస్పత్రికి జైలు సిబ్బంది తరలించారు.
కోవిడ్-19 నిర్ధారణ కావడంతో వరవరరావును సెయింట్ జార్జ్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులతో పాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.









