కరోనా రోగిని కూడా వదలని కామాంధులు

కరోనా కాలంలో కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. క్వారంటైన్ సెంటర్లలో కూడా అత్యాచారాలకు తెగబడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పన్వెల్ లో దారుణం చోటుచేసుకుంది. కరోనా రోగులను, లక్షణాలు ఉన్నవారిని అక్కడి క్వారంటైన్ సెంటర్లో ఉంచుతున్నారు. 40 ఏళ్ల మహిళ కూడా కరోనా పాజిటివ్ తో అక్కడ చేరింది. ఒక వ్యక్తి అక్కడ ఆమెపై అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. అయితే ఆ కామాంధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

ఈ సందర్భంగా పన్వెల్ జోన్-2 ఏసీపీ రవీంద్ర గీతే మాట్లాడుతూ, క్వారంటైన్ సెంటర్లో దాదాపు 400 మంది ఉన్నారని చెప్పారు. పాజిటివ్ తో అక్కడున్న మహిళపై ఒక వ్యక్తి  అత్యాచారం చేశాడని.. విషయం తెలిసిన వెంటనే అతడిని అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.  

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల