లోన్ మారటోరియం మరో రెండేళ్లు పొడిగింపు

లోన్ మారటోరియం గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎదుట హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అన్ని లోన్లకు రెండేళ్ల వరకు మారటోరియం పెంచే యోచనలో ఉన్నట్లు చెప్పారు.

Also Read :  రూ.2 లక్షలతో నీటి సదుపాయం… ప్రభుత్వ పాఠశాలలకు అండగా ‘కైండ్ ఇండియా’

 కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆయన ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు ప్రారంభమైందని మార్చి 2021 వరకు మారటోరియం కొనసాగిస్తామని వెల్లడించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం… చెల్లించని ఈఎంఐలపై ఎలాంటి అదనపు వడ్డీ గానీ పెనాల్టీ గానీ విధించకూడదని ఆదేశించింది.