ధోని సేన ఓటమి

ఐపీఎల్‌-13లో  సీఎస్‌కే కి తొలి అపజయం ఎదురైయింది. రాజస్తాన్‌ నిర్దేశించిన 217 పరుగుల టార్గెట్‌లో సీఎస్‌కే 200 పరుగులు వరకూ వచ్చి ఆగిపోయింది. ఫలితంగా రాజస్తాన్‌ రాయల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది.

ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడినా డుప్లెసిస్‌(72 , ) ఎంఎస్‌ ధోని(29 నాటౌట్‌;)లు అలరించారు. ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతే, చివర్లో ధోని బ్యాట్‌కు పనిచెప్పాడు. కాగా, అప్పటికే నష్టం జరిగిపోవడంతో సీఎస్‌కే ఓటమి తప్పలేదు. కాగా, టామ్‌ కరాన్‌ వేసిన చివరి ఓవర్‌లో ధోని హ్యాట్రిక్‌ సిక్స్‌లు కొట్టి ఫ్యాన్స్‌ను అలరించాడు.