
విరాట్ కోహ్లీ (72 ) కళాత్మక ఇన్నింగ్స్‌కు దేవదత్ పడిక్కల్ (63 దూకుడు తోడవ్వడంతో బెంగళూరు ఖాతాలో మరో విజయం నమోదైంది. ఈ రోజు మ్యాచ్‌లో రాజస్థాన్‌పై కోహ్లీసేన ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. చాహల్ ధాటికి (3/24) నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 154 పరుగులు చేసింది. మహిపాల్ (47 రాణించాడు. అనంతరం ఛేదనకు దిగిన బెంగళూరు 19.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో కోహ్లీసేన అగ్రస్థానానికి చేరింది.









