
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. పంజాబ్ బౌలర్లు విజృంభించడంతో మొదట కోల్‌కతా 9 వికెట్లకు 149 పరుగులే చేయగలిగింది. శుభ్‌మన్ గిల్ (57), మోర్గాన్ (40) రాణించారు.
షమి (3/35), రవి బిష్ణోయ్ (2/20), జోర్డాన్ (2/25), మురుగన్ అశ్విన్ (1/27) నైట్‌రైడర్స్‌ను కట్టడి చేశారు. మన్‌దీప్ సింగ్ (66 నాటౌట్ , ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ గేల్ (51 ) చెలరేగడంతో లక్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.









