ప్రతి ఒక్కరికీ 2024 కల్లా కరోనా టీకా

దేశంలో ప్రతి ఒక్కరికీ 2024 కల్లా కరోనా వైరస్‌ నిరోధక టీకా అందుతుందని పుణెకి చెందిన ఫార్మా దిగ్గజం సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదార్‌‌‌ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ వైద్యారోగ్య సిబ్బందికి, వృద్ధులకూ ఫిబ్రవరి 2021లోగా అందుతుందని.. ఇక ఏప్రిల్‌లో సాధారణ ప్రజలకు టీకా పంపిణీ ప్రారంభమౌతుందని అన్నారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

 కాగా, ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే రెండు వ్యాక్సిన్‌ మోతాదులకుగాను సుమారు రూ.1000 ఖర్చుకాగలదని ఆయన అంచనా వేశారు. పూర్తి దేశానికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందేందుకు కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుందని పూనావాలా వివరించారు. వ్యాక్సిన్‌ సరఫరా, పంపిణీల్లో గల పరిమితులు, బడ్జెట్‌ కేటాయింపులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలే ఇందుకు కారణమని ఆయన వివరించారు