
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ బహినపడింది. తమిళనాడు – పుదుచ్చేరి మధ్య, బుధవారం రాత్రి 11:30 నంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య తీరం దాటింది. అయితే ఆ తర్వాత అతి తీవ్ర తుఫాను తీవ్ర తుఫాను గా బలహీన పడింది. తీరాన్ని దాటిన అనంతరం తన దిశను స్వల్పంగా మార్చుకుంది. వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీన పడింది. ఏపీ సహా తమిళనాడు, పుదుచ్చేరి అధికార యంత్రాంగాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ తుఫాన్.. అనంతరం పరిస్థితులు భయానకంగా తయారయ్యాయి. అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులకు హోర్డింగులు చిత్తు కాగితాల్లా ఎగిరిపోయాయి.
చిత్తూరు , కర్నూలు ,ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మిగిలిన చోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు పడనున్నట్లు సమాచారం. ప్రభావిత ప్రాంత ప్రజలు తప్పనిసరిగా వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి. ఇల్లు సురక్షితం కాకపోతే పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. రైతులు అప్రమత్తంగా ఉండి , పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని విపత్తుల శాఖ కమిషనర్ తెలిపారు.









