చివరి మ్యాచ్ లో భారత్ ఓటమి.. సిరిస్ మనదే

ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా చివరివరకు పోరాడి ఓడిపోయింది. విరాట్ కోహ్లీ (85; 60 బంతుల్లో ) పోరాడినా భారత్‌కు ఓటమి తప్పలేదు.  12 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా అయిదు వికెట్లకు 186 పరుగులు చేసింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 20 ఓవర్లలో 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 85 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాట్స్‌మన్‌ ఎవరు చెప్పుకోదగిన విధంగా ఆడలేకపోయారు.  ఇప్పటికే భారత్ టీ ట్వంటీ సిరిస్ ని కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే.   

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల