
చందానగర్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ (సీబీఎస్) క్రిస్మస్ వేడుకలలో సందడి చేసిన బిగ్బాస్ ఫేమ్ హిమాజ…
ఈ సందర్భంగా సినీనటి హిమాజ మాట్లాడుతూ తన చిన్నతనంలో క్రిస్మస్ వేడుకల పరంగా ఎన్నో జ్ఞాపకాలున్నామన్నారు. తన స్నేహితులతో కలిసి ఈ వేడుకలలో పాల్గొనేదానినన్నారు. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ (సీబీఎస్) లో ఈ విధంగా క్రిస్మస్ వేడుకల నిర్వహిస్తున్నదుకు చాలా సంతోష గా ఉంది ఈ వేడుకలు నగరవాసులను ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
క్రిస్మస్ వేడుకచేసుకోవటమంటే సాధారణంగా కారోల్స్ పాడటం, నోరూరించే స్వీట్లను రుచి చూడటం , బహుమతులను వెంట తీసుకువచ్చే శాంతా కోసం వేచి చూడటం కనిపిస్తుంటుంది. మరి ఫ్యాషన్ సంగతి..? అది తాము చూసుకుంటామంటోంది చందానగర్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ (సీబీఎస్) ఈ ఫెస్టివల్ సీజన్ కోసం తాము ప్రత్యేకంగా కలెక్షన్ తీసుకురావడంతో పాటుగా వైభవంగా క్రిస్మస్ వేడుకలను కూడా ప్రారంభించామని వెల్లడిస్తున్నారు చందానగర్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ (సీబీఎస్) ప్రతినిధులు. క్రిస్మస్ బహుమతులను ఎల్లప్పుడూ స్టాకింగ్స్లోనే ఎందుకు ఉంచుతారు? అనే ప్రశ్నకు సమాధానం అందించే రీతిలో ఇక్కడ వేడుకలు జరుగనున్నాయని, క్రిస్మస్, ఆ వెంటనే వచ్చే న్యూ ఇయర్ వేడుకల కోసం కలెక్షన్ విడుదల చేశామని వారు వెల్లడిస్తున్నారు.









