Bhola Shankar Review

Bhola Shankar Review

MAIN CAST: చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, సుశాంత్
DIRECTOR: మెహర్ రమేష్
MUSIC: మహతి స్వర సాగర్
PRODUCER: అనిల్ సుంకర

TELUGUMIRCHI RATING : 2.25/5

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. తమిళ్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్ గా మెహర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే భారీ అంచనాల మధ్య నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి భోళా శంకర్ తో చిరంజీవి ప్రేక్షకులను మెప్పించగలిగాడా, లేదా తెలుసుకోవాలంటే రివ్యూ పై ఒక లుక్ వేద్దాం పదండి

శంకర్ (చిరంజీవి) తన చెల్లి మహాలక్ష్మి (కీర్తి సురేష్)తో కలిసి కోలకతాకి వస్తాడు. బ్రతుకుతెరువు కోసం టాక్సీ నడుపుతూ ఉంటాడు. ఒకరోజు బ్రేక్ డౌన్ అయ్యి కారు కోసం ఎదురుచూస్తున్న లాస్య (తమన్నా)ను కోర్టు వరకు డ్రాప్ చేస్తాడు ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో లాస్య తమ్ముడు శ్రీకర్(సుశాంత్), మహాలక్ష్మిని చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే, సిటీలో ఓ మాఫియా గ్యాంగ్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి అమ్మెస్తూ ఉంటారు. వారిని పట్టుకోలేక పోలీసులు సతమతమవుతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో శంకర్ (చిరంజీవి) ఆ మాఫియాని టార్గెట్ చేస్తాడు. అసలు శంకర్ ఆ మాఫియాని ఎందుకు టార్గెట్ చేశాడు?, గతంలో ఆ మాఫియాతో శంకర్ కి ఉన్న సంబంధం ఏమిటి ?, ఈ మధ్యలో లాయర్ లాస్య(తమన్నా)తో శంకర్ ట్రాక్ ఏమిటి ?, చివరకు శంకర్ ఆ మాఫియాని అంతం చేశాడా ?, లేదా ? అనేది మిగిలిన కథ.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సబ్జెక్టు తీసుకుని తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించామని దర్శకుడు రమేష్ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. వాస్తవానికి వేదాళం సినిమా నుంచి అక్రమ యువతుల ట్రాఫికింగ్ అనే ఒక విషయాన్ని తీసుకుని తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేర్పులు చేసిన మాట వాస్తవమే. కానీ పూర్తిస్థాయిలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి ఏ మాత్రం పట్టించుకోకుండా తనకు తాను మెగాస్టార్ చిరంజీవిని ఎలా చూసుకోవాలి అనుకున్నారో అదే విధంగా తెరమీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. చిరు రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో మెగాస్టార్ అద్భుతంగా నటించారు. ఇక చెల్లి పాత్రకు కీర్తి సురేష్ ప్రాణం పోశారు. మరో అతిధి క్యారెక్టర్ లో సుశాంత్ కూడా బాగానే నటించాడు. తమన్నా గ్లామర్ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన మురళీశర్మ పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్‌ గా చాలా బాగుంది. శ్రీముఖి కి చెప్పుకోతగ్గ క్యారెక్టర్ పడింది. ఆమె అందంతో పాటు నటన కూడా మెప్పించింది. రఘు బాబు, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఫైనల్ గా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు