సత్యరాజ్ ప్రధాన పాత్రలో యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ గా ‘వెపన్’ !


మిర్చి, బాహుబలి సహా ఎన్నో చిత్రాల్లో నటించిన కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెపన్’. మిలియన్ స్టూడియో బ్యానర్ పై గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రీసెంట్ గా రోజున విడుదల చేశారు. టీజర్ ను గమనిస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ ప్యాక్డ్ ఇన్టెన్స్ థ్రిల్లర్ లో సత్యరాజ్, వసంత్ రవి పాత్రలను నెక్ట్స్ రేంజ్ లో రూపొందించినట్లు స్పష్టమవుతుంది. సత్యరాజ్, వసంత్ రవిలపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక నటన పరంగా ఇటు సత్యరాజ్, అటు వసంత్ రవి తమదైన విలక్షణతను చాటుకునేలా పెర్ఫామెన్స్ ఇరగదీశారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ప్రభు రాఘవ్ సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తున్నాయి. సూపర్ హ్యూమన్ గురించి అన్వేషణ జరుగుతుంటుంది. అసలా సూపర్ హ్యుమన్ ఎవరు సత్యరాజా? వసంత్ రవినా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేననే క్యూరియాసిటీ కలుగుతుంది. సినిమా ట్రైలర్, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read :  డేవిడ్ రెడ్డి కోసం న్యూ అవతార్‌లో మంచు మనోజ్